హైదరాబాద్ : రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధి(Rayadurgam)లో సాఫ్ట్వేర్ ఉద్యోగి(Software employee) కిడ్నాప్(Kidnapped )స్థానికంగా కలకలం రేపింది. గురువారం సాయంత్రం కారులో వచ్చిన గుర్తుతెలియని దుండగులు సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం పక్కనే ఉన్న కేర్ హాస్పిటల్ వద్ద కిడ్నాప్ చేశారు. బాధితుడి భార్యకు దుండగులు వైఫై కాల్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. కిడ్నాప్‌కు గురైన వ్యక్తి కూకట్పల్లి వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.