హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): విద్యాభివృద్ధితోనే సమాజ పురోగతి సాధించవచ్చని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కాచిగూడలో ఆదివారం నిర్వహించిన ఎస్టీయూ (టీఎస్) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. పీఆర్సీ కమిటీ తన నివేదికను పూర్తిచేసి ప్రభుత్వానికి వెంటనే అందించాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం పర్వత్‌రెడ్డి, జీ సదానందంగౌడ్ కోరారు. 5,571 ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని, బీఎడ్, డీఎడ్‌తో నిమిత్తం లేకుండా ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలని వారు కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర నేతలు ఆట సదయ్య, గజేందర్, ఏవీ సుధాకర్, ఎల్ఎం ప్రసాద్, పోల్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ప్రాథమిక పాఠశాలలకు 10 వేల ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేసి, పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎస్జీటీలకు టీచర్ ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని ఫెడరేషన్ కోరింది. టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం వర్చువల్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వై అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాలని, ఐదు పెండిం గ్ డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ నాగిరెడ్డి, ముత్యాల రవీందర్, తిరుపతి, శ్రీనివాస్, ప్రకాశ్‌రావు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.