Rahul Gandhi | రాహుల్, ప్రియాంక.. చూస్తున్నారా.. సునీత, సబితకు మద్దతుగా నెటిజన్ల పోస్టులు
Rahul Gandhi | బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై రేవంత్ సర్కార్ సాగించిన దమనకాండపై సోషల్మీడియా వేదికగా నెటిజన్లు భగ్గుమంటున్నారు.
Rahul Gandhi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై రేవంత్ సర్కార్ సాగించిన దమనకాండపై సోషల్మీడియా వేదికగా నెటిజన్లు భగ్గుమంటున్నారు. మహిళా నేతలపై దాడులు చేయడం ఏందని కాంగ్రెస్ ప్రభుత్వంపై వేలాది పోస్టులతో దుమ్మెత్తిపోస్తున్నారు. ‘గతంలో మీ పార్టీలో మంత్రులుగా పనిచేసిన మహిళలకు.. ఇప్పుడు రేవంత్ ఇస్తున్న గౌరవాన్ని చూస్తున్నారా? రాహుల్ జీ.. ప్రియాంకా జీ?’ అంటూ ఎంజీఎం అనే నెటిజన్ ప్రశ్నించారు.
మహిళా ప్రజాప్రతినిధులపై ఇలాంటి దాడులు జరుగుతుంటే మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్ ఏం చేస్తున్నాయని కామన్ మ్యాన్ పేరిట ఓ నెటిజన్ ట్వీట్చేశారు. మాజీ మంత్రులు అందులోనూ మహిళలు అని కూడా చూడకుండా ఇలా చేయడం ఏమిటని? కేఎస్ శర్మ అనే నెటిజన్ రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘సజ్జనార్ సార్.. ఇదేనా మీ పోలీసింగ్?’ అంటూ మోహన్నాయక్ అనే నెటిజన్ ప్రశ్నించారు. ఈ ఘటనతో కాంగ్రెస్ సర్కార్ ఈ ఏడాది చివరినాటికి కూలిపోవడం ఖాయమని చికెన్ కీవ్ పేరిట ఓ నెటిజన్ జోస్యం చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

