రాష్ట్రంలో మార్చి 1 నుంచే మండుటెండలు!
హైదరాబాద్ : ఇప్పటికైతే పగలంతా ఉక్కపోతకు గురవుతూ.. రాత్రంతా చలితో వణికిపోతున్నారు ప్రజలు. పగటిపూట పలు ప్రాంతాల్లో ఎండ దంచికొడుతోంది. ఈ ఏడాది మార్చి 1 నుంచి ఎండలు మండిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత వారం 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదివారం(ఫిబ్రవరి 20) రోజు 34.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయని, మరి కొద్ది రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్నారు.
రాత్రి సమయాల్లో సగటున 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ ఏడాది హైదరాబాద్లో ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్లో గరిష్టంగా 34 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఆదివారం రోజు ఖమ్మం, నిర్మల్ జిల్లాల్లో అత్యధికంగా 37.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ములుగు, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో రాబోయే రోజుల్లో 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

