హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): భారత్‌లోని ప్రముఖ నగరాల్లో పర్యటిస్తున్న స్లోవేకియా దేశ యువకులు మైఖేల్, వైబీరవో బంజారాహిల్స్‌లోని తెలంగాణభవన్‌ను గురువారం సందర్శించారు. బీఆర్ఎస్ కార్యాలయమంతా కలియతిరిగి పార్టీ అధినేత కేసీఆర్, తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ సాధన ఉద్యమ ఫొటోలకు సంబంధించిన వివరాలను కార్యాలయ సిబ్బంది వివరించారు. తెలంగాణ భవన్ సందర్శన తమకు పూర్తి సంతృప్తినిచ్చిందని స్లోవేకియా యువకులు తెలిపారు.