హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి 2వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలుకానున్నది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు నిర్వహించగా సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్లలో ఏఐ సాంకేతికతను కూడా వినియోగించనున్నారు.
ఏఐ చాట్‌బాట్ మేధా వాట్సప్ నంబర్ 82476 23578తో వినియోగదారులు పలు అంశాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు స్లాట్ బుకింగ్ విధానం అమలుపై ఆదివారం రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకత, అవినీతి రహిత సేవల కోసం స్లాట్‌బుకింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు.