SLBC Tunnel Collapse | మహబూబ్‌నగర్, మార్చి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయ చర్యల్లోనూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. 15 అడుగుల మేర పేరుకుపోయిన బురదను తీయడం రెస్క్యూ బృందాలకు సవాల్‌గా మారింది. ఆక్సిజన్ లేకుండా ప్రాణాలకు తెగించి బురదను తొలగిస్తుంటే మళ్లీ వరదలా వచ్చి పేరుకుపోతున్నది. పైభాగంలో తవ్వుతున్నా కొద్దీ కింది భాగం నుంచి ఊట ఉబికి వస్తున్నది. అక్కడ తీసిన బురదను పక్కకు వేస్తున్నా, మళ్లీ చేరుతున్న నీరు, బురదతో రె స్క్యూ బృందాలు వెనక్కిమళ్లాయి. ఎనిమిదో రోజైన శనివారం కూడా దశలవారీగా రెస్క్యూ బృందాలు వెళ్లి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. టీబీఎం మిషన్‌ను పూర్తిస్థాయిలో తొలగిస్తేనే కార్మికుల మృతదేహాలను బయటికి తీసుకురాగలమని నిర్ధారించారు. ఆ దిశ గా దక్షిణ మధ్యరైల్వేకి చెందిన నిపుణులైన వె ల్డర్లను రంగంలోకి దించారు.
టీబీఎం మెషిన్ కట్‌చేస్తూ మరోవైపు ఆ శిథిలాలను తొలగిస్తున్నారు. ఇంకోవైపు పేరుకుపోయిన బురదను కూడా బయటకు పంపిస్తున్నారు. ఆదివారం సాయంత్రం కల్లా మృతదేహాలను వెలికి తీస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఘటనా స్థలం సమీపంలో 8 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉం చారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాలను వారి స్వ స్థలాలకు పంపిదుకు ఏర్పాట్లుచేస్తున్నారు. కనీసం తమ వారి మృతదేహాలైనా చూస్తా మా? అని బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని పత్రికల్లో వస్తున్న ఆరోపణలపై లేబర్ అధికారులు విచారణ నిర్వహించారు. బాధితులతో మాట్లాడారు.
నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఏజెన్సీ చేపట్టిన జీపీఆర్ రాడార్ స్కానింగ్‌లో కార్మికులు చిక్కుకున్న ప్రదేశాలను గుర్తించారు. రెండుసార్లు స్కాన్ రిపోర్ట్ పరిశీలించిన ఆ ఏజెన్సీ ఇచ్చిన నివేదికతో ఉన్నతాధికారులు ఇక పని సులువైందని భావించారు. ఏ క్షణంలోనైనా మృతదేహాలను వెలికి తీయవచ్చని మీడియాకు లీకులు ఇచ్చి అంబులెన్స్ రప్పించి హంగామా చేశారు. కానీ అక్కడి ప్రతికూల పరిస్థితులు ఉండటంతో సైలెంట్ అయిపోయారు.
టీబీఎం మిషన్‌ను కట్‌చేసి పూర్తిస్థాయిలో బయటికి తీస్తేనే రెస్క్యూ ఆపరేషన్ ముగిసే అవకాశం ఉన్నదని ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు మిషన్లు కట్ చేసి బయటకు తీసుకురావాలని అన్నిబృందాలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మిషన్ బయటికి వచ్చాక 2 భారీ హిటాచీలను లోపలికి పంపి బురదను, కార్మికులు చిక్కుకున్న ప్రదేశాన్ని వెలికి తీయాలని నిర్ణయించారు. ఆగమేఘాలపై హైదరాబాద్ నుం చి హిటాచీని రప్పించారు. నీరు సహాయక చర్యలకు అడ్డంకిగా మారడంతో మిషనరీ స హాయమే తీసుకోవాలని నిర్ణయించారు.
గల్లంతైన ఎనిమిది మంది మృతదేహాలను వెలికి తీసేందుకు సొరంగంలోపల ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మా రింది. టీబీఎం మిషన్ పై భాగంలో నలుగురు కింది భాగంలో మరో నలుగురు చి క్కుకొని మరణించారని భావిస్తున్నారు. సుమారు మూడు నుంచి నాలుగు మీట ర్ల కింద ఐదు మృతదేహాలు, మిషన్ కిం ది భాగంలో మిగతా మృతదేహాలు ఉం టాయనే అంచనాకు వచ్చారు. శనివారం అర్ధరాత్రి నుంచి బృందం అక్కడ బురద ను తొలగించే పనులు చేపట్టింది.