హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) ప్రారంభమయ్యాయి. ఆరో రోజైన నేడు శాసనభలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. బుధవారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. దీనిపై అధికార విపక్షాలు ఢీ అంటే ఢీ అనేలా చర్చించిన విషయం తెలిసిందే.