Medigadda | గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన మహదేవ్పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో చోటు చేసుకున్నది. నదిలో నుంచి మరో వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. గోదావరిలో గల్లంతయైన ఆరుగురి కోసం గాలిస్తున్నారు. అంబట్పల్లికి చెందిన మధుసూదన్ (18), శివమనోజ్ (15), రజిత్ (13), కర్ణాల సాగర్ (16)తో పాటు కోరకుంట్ల వాసి రామ్చరణ్ (17), స్తంభంపల్లి వాసి రాహుల్ (19) గల్లంతయ్యారు. గోదావరిలో స్నానాల కోసం ఏడుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గోదావరిలో జాలర్ల సహాయంతో యువకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. భూపాలపల్లి నుంచి మేడిగడ్డకు ఆరుగురు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలను రప్పించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.