Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Hyderabad | సికింద్రాబాద్‌లో ఆరేళ్ల బాలిక అదృశ్యం విషాదాంతమైంది. కౌకూర్‌లోని విల్లా ఆర్చిడ్స్ అపార్ట్‌మెంట్‌కు చెందిన అరులియా మోజెస్ మృతదేహాన్ని సెల్లార్లో పోలీసులు గుర్తించారు. అదే అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న విక్రమ్ ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు
Hyderabad | సికింద్రాబాద్‌లో ఆరేళ్ల బాలిక అదృశ్యం విషాదాంతమైంది. కౌకూర్‌లోని విల్లా ఆర్చిడ్స్ అపార్ట్‌మెంట్‌కు చెందిన అరులియా మోజెస్ మృతదేహాన్ని సెల్లార్లో పోలీసులు గుర్తించారు. అదే అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న విక్రమ్ ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. డబ్బుల కోసం బాలికను కిడ్నాప్ చేసి, అనంతరం హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఆరేళ్ల చిన్నారి కనిపించకుండా పోవడంతో పోలీసులు కిడ్నాప్ జరిగిందేమోన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్మెంట్ పరిసరాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా, బాలిక వెనుక విక్రమ్ వెళ్తున్న దృశ్యాలు నమోదైనట్లు గుర్తించారు. ఘటనకు ముందు రెండు రోజులుగా అతడు చిన్నారి ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగినట్లు కూడా దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలో విక్రమ్ మొబైల్ ఫోన్ లొకేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో కనిపించడంతో పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలు విల్లా కాలనీతోపాటు రైల్వే స్టేషన్, చుట్టుపక్కల లాడ్జీల్లో తనిఖీలు చేపట్టాయి. డ్రోన్ల సాయంతోనూ పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో క్లబ్‌హౌస్ సమీపంలో కనిపించిన సైకిల్ ఆధారంగా తనిఖీలు చేపట్టగా, సెల్లార్‌లోని నీటిలో బాలిక మృతదేహం బయటపడింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
రూ.20 లక్షల కోసం కిడ్నాప్ చేయాలని..
పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం.. చిన్నారిని అపహరించి ఆమె తండ్రి నుంచి రూ.20 లక్షలు వసూలు చేయాలని విక్రమ్ పథకం వేసినట్లు అనుమానిస్తున్నారు. బాలిక చేతులు, కాళ్లు కట్టేసి, నోటిలో గుడ్డలు కుక్కి కుటుంబ సభ్యులను బెదిరించాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే, విషయం బయటపడితే పట్టుబడతాననే భయంతో చిన్నారిని హత్య చేసి, మృతదేహాన్ని సెల్లార్లో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఇద్దరు అదుపులో.. ప్రధాన నిందితుడి కోసం వేట
కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. పరారీలో ఉన్న విక్రమ్ కోసం మల్కాజిగిరి జోన్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తమ కుమార్తెను కోల్పోయిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

