హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల్లో తప్పుల మీద తప్పులు బయటపడుతున్నాయి. సోమవారం నాలుగు మార్కుల ప్రశ్న మసక.. మసకగా ముద్రితం కాగా, మంగళవారం ప్రశ్నపత్రాల్లో అక్షరదోషాలు వెలుగుచూశాయి. దీంతో ప్రశ్నల అర్థం మారిపోవడంతో విద్యార్థులకు తిప్పలు తప్పలేదు. మంగళవారం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు గణితం పేపర్-1ఏ, బొటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్లకు పరీక్షలు నిర్వహించారు. ఈ మూడు పేపర్లలో రెండు చొప్పున మొత్తం 6 తప్పులు దొర్లాయి. ప్రశ్నపత్రాలు తెరిచిన తర్వాత ఆఖరు నిమిషంలో ఈ తప్పిదాలు గుర్తించిన బోర్డు అధికారులు పరీక్ష ప్రారంభమయ్యాక ఆయా అక్షరదోషాలను సవరించుకోవాలని ఆదేశాలిచ్చారు.
ఐదు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
మంగళవారం ఒకేరోజు ఐదు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండలో మూడు, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఒకటి చొప్పున ఐదుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. 23,774మంది(4.29%) పరీక్షకు గైర్హాజరయ్యారు. 5,53,423 మంది విద్యార్థులకు 5,29,649 మంది పరీక్షకు హాజరయ్యారు.
తప్పులివే..!