IAS Officers Transfer | తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్, పశుసంవర్ధకశాఖ సంయుక్త కార్యదర్శిగా అమోయ్‌కుమార్, వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శిగా టీ వినయ్‌కృష్ణారెడ్డిని నియమించింది. రోడ్లు భవనాలశాఖ సంయుక్త కార్యదర్శిగా హరీశ్, టీఎస్ఐఆర్డీ సీఈవోగా పీ కాత్యాయనిదేవి, గనులశాఖ డైరెక్టర్‌గా సుశీల్ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.