హైదరాబాద్ జూన్ 27 (నమస్తే తెలంగాణ) : త్వరలో స్థానిక ఎన్నికలు రానున్నందున ఊరూరా, వాడవాడలా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై చర్చించాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ హామీలను ఎగ్గొట్టిన తీరును ఎండగట్టారు. రైతులకు.. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, బోనస్, ఎరువుల కోసం చెప్పుల లైన్లు, మద్దతు ధర, ఉచిత కరెంట్, మహిళలకు.. తులం బంగారం, రూ.2,500, లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు, విద్యార్థులకు.. ఫీజు రీయింబర్స్మెంట్, గురుకులాల్లో పురుగుల అన్నం, ఆత్మహత్యలు, పాముకాటు మరణాలు, బస్‌పాస్‌ల పెంపు, వృద్ధులకు..
రూ.4వేల పింఛన్, కంటివెలుగు, యువకులకు.. నిరుద్యోగ భృతి, ఏటా 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, ఉద్యోగులకు.. అలవెన్స్‌లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆర్టీసీలో ఉద్యోగుల విలీనం, వ్యాపారులకు.. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు.. పెండింగ్ బిల్లులు, ఇసుకదందా, రేవంత్ బూతులు, కాంగ్రెస్ కమీషన్లు, కలెక్షన్లు, ఢిల్లీకి మూటలు, జర్నలిస్టులపై దాడులు, అక్రమ అరెస్టులపై చర్చించాలని కోరారు. నాడు కేసీఆర్, నేడు రేవంత్ పాలన ఏవిధంగా ఉందో బేరీజు వేసుకోవాలని సూచించారు.