హైదరాబాద్ : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేశామని, కేసులో ఒక మేజర్, ఐదుగురు మైనర్లు ఉన్నారని తెలిపారు. ఓ మైనర్‌కు 18 సంవత్సరాలకు నెల రోజుల వయసు తక్కువ ఉందని చెప్పారు. బెంగళూరులో నివసించే బాబు స్కూల్ ప్రారంభానికి ముందు దోస్తులకు ఒక పార్టీ ఏర్పాటు చేయాలని.. హైదరాబాద్‌లో ఉన్న ముగ్గురు స్నేహితులను సంప్రదించాడని, 100 మందికి ఏ పబ్, ఎక్కడ పెడితే బాగుంటుందో వారితో సర్వే చేయించినట్లు చెప్పారు.
అతని ముగ్గురు స్నేహితులు ఇన్సోమియా పబ్ అయితే బాగుంటుందని, రూ.1500కే వివిధ రాల పాస్‌లు ఉంటాయని చెప్పారని సీపీ తెలిపారు. అయితే, ఆ బాలుడు ‘యూఫోరియా కమింగ్ సూన్’ అని ఏప్రిల్‌లో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశాడన్నారు. ఆ తర్వాత నాన్ ఆల్కహాలిక్, నాన్ స్మోకింగ్ పార్టీ కోసం ఇన్సోమియా పబ్‌లో బుక్ చేశారని, కునాల్ అనే మేనేజింగ్ పార్టనర్ ద్వారా ఉస్మాన్ అలీఖాన్ వ్యక్తి పబ్‌ను బుక్ చేశాడన్నారు. బేరమాడి రూ.1200 పాస్‌ను రూ.900కు తగ్గించారని, ఆ తర్వాత బాలుడు ‘యూఫోరియా పార్టీ ఆన్ 28 మే వన్ పీఎం’ అంటూ మే రెండోవారంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడన్నారు. డేట్ ఫిక్స్ కావడంతో దానికి రెస్పాన్స్ రావడం వచ్చిందని, అయితే రూ.900కి తగ్గించారని చెప్పకుండా రూ.1200 వసూలు చేశారని సీపీ చెప్పారు.
25న బాలుడు బెంగళూరు నుంచి వచ్చాడని, సర్వే చేసి రూ.లక్ష అడ్వాన్స్ చెల్లించారన్నారు. ఫ్రెండ్ చెప్పడంతో మైనరైన బాధితురాలు రూ.1300 ఎంట్రీ ఫీజు చెల్లించిందని, 28న ఫ్రెండ్‌తో కలిసి పబ్‌కు చేరుకుందన్నారు. 28న సంఘటన జరిగిందని, మే 31న సాయంత్రం 8 గంటల వరకు తల్లిదండ్రులకు చెప్పలేదన్నారు. మెడపై గాయాలుండడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. అదే రోజు జూబ్లీహిల్స్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైందన్నారు. ఆ తర్వాత బాధితురాలు వివరాలు తెలుపకపోవడంతో భరోసా సెంటర్‌కు పంపడం జరిగిందని, అక్కడ అడిషనల్ డీసీపీ శిరీష భరోసా కల్పించడంతో బాధితురాలు వివరాలు చెప్పిందన్నారు.
ఆ తర్వాత 376డీ, 323, పోక్సోయాక్ట్ సెక్షన్ 5 రెడ్‌విత్ 6 కింద కేసు నమోదు చేశామన్నారు. ఆ తర్వాత బాధితురాలిని నిలోఫర్‌కు తరలించి, దర్యాప్తు ప్రారంభించామన్నారు. జూన్ 2న గ్యాంగ్ రేప్లో ఎవరెవరున్నారు? సీసీటీవీల ఫుటేజీలను పరిశీలించామని, బాధితురాలు ఎవరినీ గుర్తు పట్టలేదన్నారు. ఒకరి పేరు తప్పా.. వారేవరి పేర్లు.. ఐడెంటిటి బాధితురాలికి తెలియదని, జూన్ 3న రాత్రి 9 గంటలకు ఆరుగురు నిందుతుల్లో ఒక మేజర్ సాదుద్దీన్ మాలిక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. 4న సీసీఎల్-1, సీసీఎల్-2ను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచగా.. జువైనల్ హోంకు తరలించామని, 5న సీసీఎల్‌ను పట్టుకొని జువైనల్ బోర్డుకు పంపామన్నారు.
పబ్‌లోపల, బయట, బిల్డింగ్ ఎంట్రెన్స్, రోడ్ల వెంట ఉన్న సీసీటీవీ ఫుటేజీలు, బేకరిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించామని, ఇవాళ సాయంత్రం బాధితురాలు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిందన్నారు. దాంతో వివరాలను సరిపోల్చుకొని వివరాలను మీడియా ముందు పెట్టినట్లు సీపీ తెలిపారు. మే 28న మధ్యాహ్నం మధ్యాహ్నం 1.10 గంటలకు బాధితురాలు స్నేహితుడితో కలిసి పబ్‌కు వెళ్లిందని, 1.50 గంటల వరకు బాలుడితో కలిసి డ్యాన్ చేసిందన్నారు. ఆ తర్వాత వేరే పని ఉండడంతో వెళ్లిపోయాడని సీపీ తెలిపారు. 3.15గంటలకు సీసీఎల్-1 ఆమెను కలిశాడని, ఆ తర్వాత మరో నిందుతుడు సాదుద్దీన్ బాధితురాలితో అసభ్యంగా వ్యవహరించాడన్నారు.
వేధింపులు ఎక్కువ కావడంతో 5.40 గంటలకు బాధితురాలు ఫ్రెండ్‌తో కలిసి పబ్ నుంచి బయటకు వచ్చారని, అప్పటికే పబ్‌లో మైనర్లంతా (సీసీఎల్స్) అప్పటికే పథకం ప్రకారం వేధింపులకు గురి చేశారని భావిస్తున్నామన్నారు. బాధితురాలితో బయటకు వచ్చిన అమ్మాయి ఆ తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్లిందని, సీసీఎల్స్ అంతా మాట్లాడి బాధితురాలిని ట్రాప్ చేశారన్నారు. సాయంత్రం 5.43 గంటలకు నలుగురు సీసీఎల్స్, బాధితురాలు మెర్సిడ్బెంజ్లో బేకరీకి వెళ్లేందుకు కారు ఎక్కారనీ, అదే సమయంలో నలుగురు ఇన్నోవా కారు ఎక్కారన్నారు. దాంట్లో సాదుద్దీన్‌తో పాటు సీసీఎల్స్ ఉన్నారు. అయితే, పబ్ రోడ్ నంబర్ 36లో ఉండగా.. అక్కడి నుంచి రోడ్ నంబర్ 14 బంజారాహిల్స్ బేకరికి వెళ్లే దారిలో మెర్సిడెజ్లో ఉన్న నలుగురు సీసీఎల్స్ బలవంతంగా ముద్దులు పెట్టారని, వాళ్లే వీడియోలు తీయడంతో పాటు సర్క్యులేట్ చేశారన్నారు.
రెండు కార్లు బేకరికి 5.51కి చేరాయని, 5.40కి బాధితురాలు కారు నుంచి దిగి ఇన్నోవాలోకి ఎక్కిందన్నారు. 5.57కి ఇన్నోవా, మెర్సిడెజ్ పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ చేశారని, 6.15 గంటలకు ఇన్నోవా కారు బేకరి నుంచి వెళ్లి పోయిందని, ఏ1 సాదుద్దీన్ మాలిక్, మరో ఐదుగురు సీసీఎల్స్, బాధిరాలు అక్కడి నుంచి వెళ్లిపోయారన్నారు. 6.18కి ఐదుగురు సీసీఎల్స్ ఒకరు రిటర్న్ బేకరికి వచ్చాడు. బాధితురాలు సీసీఎల్స్, సాదుద్దీన్ మాలిక్, బాధితురాలు రోడ్ నంబర్ 44 పెద్దమ్మ టెంపుల్ వద్ద నిర్మాణుష్య ప్రాంతంలో కారును నిలిపి ఆ తర్వాత.. ఓ సీసీఎల్ లైంగిక దాడికి పాల్పడ్డారని, ఆ తర్వాత నలుగురు రేప్ చేశారు. లైంగిక దాడి సమయంలో బాలిక మెడతో పాటు పలుచోట్ల గాయాలయ్యాయన్నారు.
ఆ తర్వాత 7.31కి ఇన్నోవా పబ్‌కి తిరిగి వచ్చిందని, బాధితురాలిని దింపేసి వారంతా వెళ్లిపోయారన్నారు. బాధితురాలు తండ్రికి ఫోన్ చేస్తే వచ్చి ఇంటికి తీసుకువెళ్లారని వివరించారు. కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని, ఏ1 సాదుద్దీన్ మాలిక్‌ను అరెస్టు చేశామని, ఆ తర్వాత సీసీఎల్స్ను అదుపులోకి తీసుకున్నారు. మరో సీసీఎల్ పరారీలో ఉండగా.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో ఉండగా.. జువైనల్ హోంకు తరలిస్తామన్నారు. ఘటనలో 376డీ, 323, పోక్సో 5జీ రెడ్‌విత్ 6 అంతే కాకుండా 366 కిడ్నాప్ ఆఫ్ మైనర్, ఐటీ యాక్ట్ 67 కింద కేసులు నమోదు చేశామన్నారు.
ఇందులో చనిపోయే వరకు జైలు, డెత్ పెనాల్టీ విధించే అవకాశం ఉంటుందన్నారు. అదే సమయంలో బాధితురాలికి పరిహారం చెల్లించేలా నిందితులకు కోర్టు ఫైన్ విధించే అవకాశం ఉంటుందన్నారు. ఆరుగురిలో ఓ సీసీఎల్ లైంగిక దాడిలో పాల్గొనలేదని, వేధింపులకు పాల్పడ్డారని సీపీ వివరించారు. అతనిపై ఐపీసీ 354, ఐపీసీ 323 సెక్షన్ 9జీ రెడ్‌విత్ 10 కింద కేసు నమోదు చేశామని, ఇందులో ఐదు నుంచే ఏడేళ్లు శిక్ష పడే అవకాశం ఉంటుందన్నారు. అలాగే పబ్‌పై రిపోర్ట్‌ను ఎక్సైస్శాఖను పంపించామన్నారు. పోలీసింగ్ లైసెన్స్ సిస్టమ్‌ను నాలుగైదేళ్ల కింద మానేశామని, మళ్లీ ప్రారంభించనున్నట్లు వివరించారు.