మహబూబ్‌నగర్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):/ మూసాపేట : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువతిపై లైంగికదాడి, ఆపై హత్య కేసును పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని దీనిపై సిట్ ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, దళిత, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కేసును రాజకీయ కోణంలో చూడొద్దని సాక్షాత్తు ఎస్పీ పేర్కొన డం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మందకృష్ణతోపాటు వివిధ ప్రజా సం ఘాలు, దళిత సంఘాల నాయకులు ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామానికి వెళ్లి నిజనిర్ధారణ చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడితోపాటు అతని స్నేహితుల పాత్ర కూడా ఉన్నదని ఊరు మొత్తం కోడై కూ స్తున్నా పోలీసులు దర్యాప్తు చేపట్టడం లేదని ఆరోపించారు. ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో ఎట్టకేలకు జిల్లా అధికార యంత్రాం గం కదిలింది. కలెక్టర్ విజయేంద్రబోయి గ్రా మానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అధికార పార్టీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి బందోబస్తు నడుమ బాధితులను పరామర్శించారు.