నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 26 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో శ్రావణ్‌రావును పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ అధికారులు సోమవారం నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రొడక్షన్ వారెంట్‌పై ఆయనను అదుపులోకి తీసుకోవాలనుకుంటున్న సిట్ అధికారులు..
సుప్రీంకోర్టు ఆదేశాలను శ్రావణ్‌రావు పాటించలేదని, విచారణకు సహకరించలేదని తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలిపారు. ప్రస్తుతం శ్రావణ్‌రావు అఖండ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేసులో రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే.