హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రత్యేక సిట్ బుధవారం పలువురికి నోటీసులు జారీచేసింది. వారిలో ముఖ్యమంత్రి సోదరుడు కొండల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జైపాల్‌యాదవ్‌ను గురువారం విచారణకు రావాలని కోరింది. చిరుమర్తి లింగయ్యను గతంలో కూడా ఒకసారి అధికారులు విచారించారు.
నవీన్‌రావు తండ్రి కొండల్‌రావును సైతం వి చారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే, అనారోగ్య కారణాల వల్ల తాను రాలేనని, తన నివాసంలోనే వాం గ్మూలం తీసుకోవాలని ఆయన సిట్ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఇ దే కేసులో సందీప్‌రావు సైతం సిట్ నోటీసు లు ఇచ్చింది. అయితే, ఆయన విదేశా ల్లో ఉండటంతో హాజరుకాలేకపోతున్నారు.