కౌటాల, జూన్ 29 : బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు వెంటనే భద్రత కల్పించాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలోని కుమ్రం భీం చౌరస్తాలో ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. సీనియర్ ఐపీఎస్ అధికారికి భద్రత తొలగించడం సరికాదని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతగాకపోతే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు భద్రతను పునఃరుద్ధరించాలని కోరారు. సుమారు గంటపాటు ధర్నా చేయడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఏఎస్సై దేవీసింగ్ సముదాయించి ఆందోళన విరమింపజేశారు. ఈ ఆందోళనలో బీఆర్ఎస్ సర్పంచులు బిక్కు పటేల్, వెంకటేశ్, ఉప సర్పంచ్‌లు గోపాల్, రవి, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.