‘గుడ్డెద్దు చేలో పడ్డట్టు.. మండలి తీరు‘: మధుసూదనాచారి
తెలంగాణ శాసనమండలి సమావేశాలు సాగుతున్న తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా ఉన్నాయని ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. కౌన్సిల్ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రజా సమస్యలను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసి పోలీసుల సాయంతో సభను నెట్టుకొస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ శాసనమండలి సమావేశాలు సాగుతున్న తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా ఉన్నాయని ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. కౌన్సిల్ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రజా సమస్యలను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసి పోలీసుల సాయంతో సభను నెట్టుకొస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ బయట పోలీసులతో, సభ లోపల మార్షల్స్‌తో భయానక వాతావరణం సృష్టించి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చర్చించే చిత్తశుద్ధి ఏమాత్రం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి సోదరుడికి కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా కట్టబెట్టారని, దీనిపై పారదర్శకమైన చర్చ జరగాలని తాము వాయిదా తీర్మానం ఇస్తే దానిని ఏకపక్షంగా తిరసరించారని మండిపడ్డారు. ఒకవైపు సాగునీరు అందక అన్నదాతలు అల్లాడుతున్నారని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాక లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తంచేశారు.
8కేసీఆర్ చావు కోరిన ఎమ్మెల్యేపై చర్యలేవి? : ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావు కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో తక్షణమే స్పష్టం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి డిమాండ్‌చేశారు. కౌన్సిల్ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఇంట్లో ఉంటే అకడికి చావు డప్పులు పంపించే దిగజారుడు సంసృతి ఏమిటని మండిపడ్డారు. కేసీఆర్ మరణాన్ని కోరుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను ఇప్పటికీ స్వేచ్ఛగా రోడ్లపై తిరగనివ్వడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధిత ఆస్తుల జాబితా (పీవోబీ) నుంచి ఒక ఎకరం భూమిని తొలగించాలన్నా ఐఏఎస్ అధికారులకు కనీస అధికారం లేకుండా చేశారని నిప్పులు చెరిగారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
Revanth Reddy | చదువును వ్యాపారం చేయొద్దని అప్పుడు ఉపన్యాసాలు.. ఇప్పుడు కూతురితోనే కార్పొరేట్ స్కూల్.. సీఎం రేవంత్ తీరుపై క్రిశాంక్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

