హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షలో ‘పాట’ ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యక్షంగా చూశాం. నిరసన రూపాల్లో ప్రధానపాత్ర పోషించే పాట.. గురువారం నాటి అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రజాకంఠక పాలనపై ‘నిరసన గీతం’గా రూపుదిద్దుకున్నది. 22ఏ భూములపై చర్చకు శాసనమండలి సుముఖత చూపకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న కాంగ్రెస్ పార్టీ విధానాలు, సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా నిరసన గీతాలు పాడారు. దీనికి మిగిన ఎమ్మెల్సీలు చప్పట్లతో కోరస్ ఇవ్వడంతో సభ వేడెక్కింది. చైర్మన్ వారించినా బీఆర్ఎస్ సభ్యులు వెనకి తగ్గకుండా పాటలు అందుకున్నారు. అంతకుముందు కొత్త కొత్త నినాదాలతో హోరెత్తించారు. అనంతరం అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్సీలు కూడా తాళం వేశారు.
‘ఆరూ గ్యారంటీలు ఆవిరి జేసిన్రూ
అడ్డగోలు హామీలు గంగల
కలిపిన్రూ
గాలి గాలి మాటలతో
గత్తర లేపిన్రూ
రోతపుట్టె మాటలతో రోజులు
గడిపిన్రూ
మోఖా జూస్తిరి – దోఖా జేస్తిరి
కన్ను మూసి తెర్శే వరకు
మొత్తం దోస్తిరీ
మాయా జేస్తిరీ.. మత్పరిస్తిరీ
అందమైన తెలంగాణ నాగం జేస్తిరీ

తొండి చేసినరు కొడుకా..
మొండి చెయ్యి
చూపినరు కొడుకా..
ఇందిరమ్మ రాజ్యమని కొడుకా..
నిండముంచినరు కొడుకా..
గల్లీ కాంగ్రెస్ మాటనమ్మరని
ఢిల్లీ పెద్దల తీసుకొస్తిరి
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
బాధ్యతమాదని బాస జేసిరీ
తల్లి తోడని.. పిల్లితోడని
బాండు పేపర్లు భలే రాస్తిరి
వందరోజుల్లో అమలు చేస్తమని
బొంకులాడితిరి బొందబెట్టితిరి
తొండి చేసినరు కొడుకా
మొండి చెయ్యి చూపినరు కొడుకా
ఇందిరమ్మ రాజ్యమని కొడుకా – నిండముంచినరు కొడుకా’
గోరటి గానం.. ఎమ్మెల్సీల కోరస్!
ఇంటిని వంటిని నిలిచిన తావును
నిషేధిస్తే ఎటు పోవాలి?
స్వేదం పోసిన భూతల్లిని చెరబెడితే
ఏ గతి కావాలి?
ప్రజాస్వామ్యమనే వేకువకు చర్చలే
ఊపిరి, ప్రాణం కాదా?
చర్చను ఆపిన చట్టసభలకు
ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎకడిది?
న్యాయం ధర్మం ఏదో ఇచ్చట
నిజముగా చర్చలు జరగాలి..
ద్వేషం ఎవరు కకినా గాని
దోషులుగా నిలదీయాలి..
‘వద్దురా నాయన ఈ కాంగ్రెస్సు
పాలన వద్దురా నాయనా
వద్దురా నాయన ఈ కాంగ్రెస్సు
పాలన వద్దురా నాయన
అరెరే వద్దురా నాయన ఈ నయ
వంచన పాలన వద్దురా నాయనా
అమలు గాని హామీలతో వారు
గ్యారెంటీలతో
అధికారం చేతబట్టి అరి గోసలు
పెడుతున్నది..
వద్దురా ..అరెరే వద్దురా.. అరె
వద్దురా నాయనా
ఈ కాంగ్రెస్ పాలన వద్దురా
నాయనా
రైతు బంధు రానే లేదు..
దళిత బంధు లేనే లేదు
పింఛను పెంచింది లేదు..
ఆశపడితే మోసమాయే
చెరువును నింపింది లేదు..
కరువును ఆపింది లేదు
తన్నినట్టు అడగబోతే లొల్లి పెట్టి
అడ్డగోలు తిడుతున్నరు
వద్దురో.. అరెరే వద్దురో..
అరె చల్ వద్దురా నాయనా..
ఈ కాంగ్రెస్సు పాలన వద్దురా