హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. ‘స్వార్థమే పరమార్థంగా, ద్రోహమే వెన్నతోపెట్టిన విద్యగా మలుచుకున్న రేవంత్‌రెడ్డీ.. కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా వక్రీకరిస్తూ.. రాక్షసానందం పొందుతూ, దేశంలోనే తెలంగాణను నంబర్ వన్‌గా తీర్చిదిద్దిన కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావ్..
కేసీఆర్‌తో పోల్చుకోవడమా? ఆయనను చాలెంజ్ చేసేంత వాడివా? కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోవు’ అని మంగళవారం ఒక ప్రకటనలో సిరికొండ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతామని బీరాలు పలుకుతున్న రేవంత్‌రెడ్డికి దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, గెలిపించుకోవాలని సవాలు చేశారు. రాష్ట్రంలో ఏ నోట విన్నా, ఏ చోట ఉన్నా కేసీఆర్ దార్శనికత, రేవంత్‌రెడ్డి దాష్టీకం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారని, ‘రేవంత్ పోవాలె.. కేసీఆర్ రావాలె’ అని భావిస్తున్నారని చెప్పారు.