హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్షనేతగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారిని గుర్తిస్తున్నట్టుగా శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు గెజిట్ విడుదల చేశారు. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారిని శాసనమండలిలో తమ పార్టీ నేతగా ఎంపిక చేశామని, ఇందుకు సంబంధించిన లాంఛనాలు పూర్తిచేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత నెలలో శాసనసభ కార్యదర్శికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖను పరిగణనలోకి తీసుకొని బుధవారం శాసనసభ కార్యదర్శి గెజిట్ విడుదల చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో కీలకమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంపై ఉత్కంఠ నెలకొన్నది. ప్రస్తుత కమిషనర్ పార్థసారథి పదవీ కాలం ఈనెల 8వ తేదీ తో ముగిసింది. ఆయనను మరో సంవత్సరం కొనసాగించే అవకాశం ఉన్నా.. ఫైల్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఇంతవరకు సంత కం చేయలేదు. దీంతో ఆయనను కొనసాగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్థసారథి కేవలం నాలుగేండ్లు మాత్రమే పదవిలో కొనసాగారు. వాస్తవంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ఐదు సంవత్సరా లు. పంచాయతీరాజ్ చట్టంలోనూ అదే పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్‌గా ము ఖ్యకార్యదర్శి లేదా అంత కంటే ఎక్కువ హోదాలో పనిచేసిన ఐఏఎస్ అధికారిని నియమించాల్సి ఉంటుంది. హైకో ర్టు జడ్జి స్థాయికి సమానమైన కమిషనర్ పదవికి జడ్జికి వర్తించే నిబంధనలన్నీ వర్తిస్తాయి. 65 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిని ఎంపిక చేయాలి. ఈ కోణం లో కొత్త ఎన్నికల కమిషనర్ కోసం అన్వేషణ ప్రారంభమైందని తెలిసింది.