కార్మికుల కూలీ పెంచాలని పనులు బంద్
కూలీపెంపుపై యాజమానుల వైఖరితో సమ్మె
రెండు రోజుల్లో పరిష్కరించాలి
లేనియెడల సమ్మె పోరాటాలు ఉదృతం చేస్తాం
సీఐటీయు పవర్ లూం వర్కర్స్ యూనియాన్ జిల్లా అధ్యక్షుడు రమణ
Siricilla Textile Park | సిరిసిల్ల రూరల్, ఆగస్టు 19 : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్ టైల్ పార్కులోని కార్మికులు మంగళవారం సమ్మె బాట పట్టారు. టెక్స్ టైల్ పార్క్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు వస్త్రాలకు కూలీ పెంచాలని ఇటీవలే యాజమానులను కోరగా, యాజమానులు కూలీ పెంపుపై ఎటు తేల్చకపోవడంతో కార్మికులు సమ్మె బాట పట్టారు.
ఈ మేరకు మంగళవారం టెక్స్ టైల్ పార్క్ పవర్ లూం కార్మికుల సమావేశం యూనియన్ అధ్యక్షుడు కూచన శంకర్ ఆధ్యక్షతన జరిగింది. సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేటు వస్త్రాలకు యాజమానులు కూలీ పెంచే వరకు కార్మికులు పనుల్లోకి వెళ్లకూడదని తీర్మాణం చేశారు. అనంతరం పార్క్ లోని క్యాంటీన్ నుంచి ప్రధాన గేట్ వరకు కార్మికులు ర్యాలీగా వెల్లి, ప్రధాన గేటు ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, యాజమానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం సీఐటీయు పవర్ లూం వర్కర్స్ యూనియన్ జిల్లా ఆధ్యక్షుడు కోడం రమణ మాట్లాడారు. టెక్స్టైల్ పార్క్ కార్మికులు మెరుగైన ఉపాధి కోసం కూలీ పెంచాలని, ప్రభుత్వ వస్త్రాలకు రోజుకు రూ. వెయ్యి పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆర్డర్లకు కార్మికుల కష్టానికి తగిన కూలీ చెల్లించకుండా కార్మికులను నష్టం చేసేలా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. కూలీ ఒప్పందం ముగిసిన ప్రైవేటు వస్త్రానికి కూడా 10 పిక్కులకు 50 పైసలు కూలీ పెంచాలని డిమాండ్ చేశారు. ఈవిషయంపై యాజమానుల సంఘానికి 5 రోజుల క్రితమే నోటిస్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఎలాంటి చర్చలు జరపకుండా కార్మికులు కూలీ పెంపు పట్ల నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారన్నారు. దీంతోనే మంగళవారం నుంచి స్వఛ్ఛందంగా పనులు బంద్ చేసి, సమ్మెలోకి వెళ్లడం జరిగిందన్నారు. ఇప్పటికైనా యాజమానులు స్పందించి, కార్మికులకు కష్టానికి తగిన వేతనాలు వచ్చే విధంగా కూలీ పెంచాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు కూడా స్పందించి, యాజమానులు కూలీ పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని, లేనియెడల సమ్మె పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో సదానందం, సంపత్, శ్రీనివాస్, కిషన్, శ్రీకాంత్, ఆంజనేయులు, రామచంద్రం, వేణు, వెంకటేశం, అంబదాస్, రమేష్, రాజు, మహేష్, జనార్దన్, గంగయ్య, శ్రీనివాస్, అశోక్, రామచంద్రం, వరప్రసాద్, గణేష్, మనోహర్, రాజశేఖర్, ప్రశాంత్, రాకేష్, రాజేశ్, మోహణ్, కార్మికులు ఉన్నారు.