హైదరాబాద్ : తెలంగాణలోని రజకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అధునాతన ధోభిఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధునాతన యాంత్రీకృత ధోభిఘాట్ను నిర్మించారు. ఈ సందర్భంగా ఆ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆయన బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని వెంకంపేటలో రూ. 1 కోటి 34 లక్షలతో అందుబాటులోకి తీసుకువచ్చిన ఆధునిక యాంత్రీకృత ధోభీఘాట్ను నిన్న మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ రమణ కలిసి ప్రారంభించారు. రోజుకు 120 కేజీల బట్టలను ఉతికే విధంగా ఈ ధోభిఘాట్ను నిర్మించారు.
My compliments to @Collector_RSL Garu and his team on building a modern mechanised Dhobi Ghat at Siricilla 👍
We will be expanding this initiative to all towns in #Telangana pic.twitter.com/9HjmaJocvV
— KTR (@KTRTRS) February 4, 2022
సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని వెంకంపేటలో 1 కోటి 34 లక్షల రూపాయలతో అందుబాటులోకి తీసుకువచ్చిన ఆధునిక యాంత్రీకృత ధోభీఘాట్ ను ప్రారంభించిన గౌరవ మంత్రివర్యులు శ్రీ @KTRTRS, ఎమ్మెల్సీ @RamanaLgandula pic.twitter.com/j3BbbHENED
— CollRajannaSircilla (@Collector_RSL) February 3, 2022