హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): వలస జనాభా ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాలకు అనుగుణంగా ఒక నిర్దిష్ట వ్యూహాన్ని రూపొందించుకొని ‘సర్’ను పకడ్బందీగా నిర్వమించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్‌లోని సీఈవో కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవోలు), ఎన్నికల నమోదు అధికారులతో (ఈఆర్వోలు) ప్రత్యేక విసృ్తత సవరణ (సర్) ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ఓటర్ల మ్యాపింగ్ స్థితిపై సమీక్షించారు.