హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఎన్డీఏస్ఏ హెచ్చరికలతో ఇరిగేషన్‌శాఖ ఎట్టకేలకు కండ్లు తెరిచింది. సింగూరు డ్యామ్ రక్షణకు పూనుకున్నది. మొదటగా వర్షాకాలం సీజన్ ముగిసేవర కూ ప్రాజెక్టు కనీస నీటి నిల్వస్థాయిని త గ్గించాలని నిర్ణయించింది. తదుపరి శాశ్వ త మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నది. తాగునీటి కోసం ఈ ఏడాది ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని ఇప్పటికే హైదరాబాద్ వాటర్ బోర్డు(హెచ్ఎండబ్ల్యూఎస్)కు సైతం ఇరిగేషన్‌శాఖ తేల్చిచెప్పింది. డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ (డీఎస్ఆర్పీ) సింగూర్ డ్యామ్‌ను వర్షాకాలం ముందు తనిఖీ చేసింది. ఆ నివేదికను ఎన్డీఎస్ఏకు సమర్పించింది. డీఎస్ఆర్పీ నివేదికలోని అంశాలు పరిశీలించిన ఎన్డీఎస్ఏ.. సింగూరు డ్యామ్ అ త్యంత ప్రమాదకరస్థితిలో ఉందని హెచ్చరించింది. తక్షణం రక్షణ చర్యలు చేపట్టాలని, కార్యాచరణపై 21లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తెలంగా ణ రాష్ట్ర నీటి పారుదలశాఖ ఈఎన్సీ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ కమిటీ చైర్మన్‌కు ఇటీవల ఎన్డీఎస్ఏ రీజినల్ డైరెక్టర్ లేఖ రాశారు. ఇరిగేషన్‌శాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది.
సాధారణంగా ప్రాజెక్టుల్లో ఎఫ్ఆర్ఎల్(ఫుల్ రిజర్వాయర్ లెవల్) వరకు నీళ్లు రావడం, ఆ తరువాత సీజన్లో క్రమం గా తగ్గిపోవడం పరిపాటి. కానీ సింగూరు డ్యామ్ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. డ్యామ్‌ను పూర్తిగా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసమే వినియోగిస్తున్నారు. మిషన్ భగీరథ పథకం కోసం రిజర్వాయర్ కనీస స్థాయిని నిత్యం 522 మీటర్లు కంటే ఎకువగా నిర్వహించాల్సి న పరిస్థితి. నిండుగా ఉండటం మూలం గా డ్యామ్ ఎగువ వాలుపైనున్న రివెట్మెంట్తోపాటు, ఎఫ్ఆర్ఎల్ భాగానికి సమీపంలోని వివిధ ప్రదేశాల్లో మట్టి వాలు రివెట్మెంట్ దెబ్బతింది. ఇదే విషయాన్ని డీఎస్ఆర్పీ, ఎన్డీఎస్ఏ కూడా వెల్లడించింది. ప్రస్తుతం డ్యామ్ ఎఫ్‌ఆర్‌ఎల్‌ను 2 మీటర్లు తగ్గించి, 520 మీటర్ల వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సీజన్ ముగిసిన వెంటనే తక్షణం మరమ్మతులు చేపట్టాలని ఇరిగేషన్‌శాఖ భావిస్తున్నది. తాగునీటికి ఈ ఏడాది ప్రత్యామ్నాయం చూసుకోవాలని హెచ్ఎండబ్ల్యూఎస్కు సైతం ఇప్పటికే ఇరిగేషన్‌శాఖ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తున్నది.
ఇప్పటికే రూ.16కోట్లతో ప్రతిపాదనలు..
రివెట్మెంట్తోపాటు, ఎఫ్ఆర్ఎల్ భాగానికి సమీపంలోని వివిధ ప్రదేశాల్లో మట్టి వాలు రివెట్మెంట్ దెబ్బతిందని వివరించింది. పారాపెట్ గోడకు ఆనుకుని ఉన్న ఎర్త్ డ్యామ్ పైభాగంలో పగుళ్లు ఉన్నాయని, గోడ కూడా ఎగువ వైపునకు వంగిపోయి ఉన్నదని డీఎస్ఆర్పీ గతంలోనూ వెల్లడించింది. సింగూర్ ప్రాజెక్టు రాతికట్టను రూ.16కోట్ల నిధులతో మరమ్మతులు చేపట్టేందుకు గతంలోనే నిర్ణయించారు. సింగూర్ డ్యామ్‌కు ఇరువైపులా 7 కి.మీ మేర మట్టి, రాతితో కట్ట విస్తరించి ఉంది. నీటి అలల తాకిడికి మట్టితో కూడిన రాతి కట్ట పలు చోట్ల కుంగిపోయింది. విషయాన్ని గుర్తించిన సాగునీటి పారుదలశాఖ అధికారులు కట్ట మరమ్మతులకు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి గతంలోనే ప్రతిపాదించారు. ఆమోదం కూడా లభించింది. అయితే పనులను మాత్రం ఇప్పటికీ చేపట్టలేదు. తాజాగా ఎన్డీఎస్ఏ హెచ్చరికలతో ప్రస్తుతం మరమ్మతు పనులు చేపట్టేందుకు ఇరిగేషన్‌శాఖ సిద్ధమైంది.