Khammam | వేంసూరు, ఆగస్టు 12: ‘సారూ.. నా సాగు భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం ఇప్పించండి’ అంటూ తహసీల్దార్ కాళ్లు మొక్కి వేడుకుంది ఓ ఒంటరి మహిళ. ఈ ఘటన సోమవారం ఖమ్మం జిల్లా వేం సూరు తహసీల్దార్ కార్యాలయంలో జరి గిన ‘ప్రజావాణి’లో చోటుచేసుకుంది. అ మ్మపాలెం గ్రామానికి చెందిన ఒంటరి మ హిళ లోకా నాగమణి, తనకు తన తండ్రి గోపయ్య ఎకరం భూమిని పెద్దల సమక్షం లో సాదా కాగితంపై రాసి ఇచ్చినట్టు తెలిపింది.
తన అన్న, ఆయన భార్య కలిసి భూమిని వారి పేరున చేసుకున్నారని వివరించింది. తన పేరిట పాస్‌బుక్ ఇప్పించాలని తహసీల్దార్‌ను వేడుకుంటూ కంటతడి పెట్టింది. అదే తహసీల్దార్ కార్యాలయంలో మరో మహిళ కూడా కంటతడి పెట్టుకుంది.
కుంచపర్తికి చెందిన మొగిలపాడు సుశీల అదే గ్రామానికి చెందిన జమ్ముల శ్రీనివాసరావు వద్ద 19 కుంటల సాగు భూమి కొనుగోలు చేశానని, దానికి అగ్రిమెంట్లు కూడా ఉన్నాయని, కానీ తన పేరుతో పాస్‌బుక్ మంజూరు కాలేదని తెలిపింది. గత రెవెన్యూ అధికారులు తన భూమిని ధరణిలో మరొకరి పేరుతో ఎక్కించి తనకు అన్యాయం చేశారని వాపోయింది. తనకు న్యాయం చేయాలంటూ మొరపెట్టుకుంది.