మొన్నటి వరకు కరుడుగట్టిన కాంగ్రెస్‌వాదిగా ఉండి.. ఇప్పుడు పార్టీ మారారు కారణం?
ముప్పయ్ ఏండ్లు కాంగ్రెస్ కార్యకర్తగా, పార్టీకి సేవలు చేశాను. ఆస్తులు అమ్ముకున్నా! సమయం, వయసు అన్నీ కాంగ్రెస్ కోసమే త్యాగం చేశాను. ఇప్పుడు రేవంత్‌రెడ్డి వచ్చి నా రాజకీయ జీవితం మీదనే దెబ్బ కొట్టాడు. ఇక ఆ పార్టీలో ఉండాలనిపించక బీఆర్ఎస్లో చేరాను.
మీ సమరం కాంగ్రెస్‌తోనా? రేవంత్ రెడ్డితోనా?
పార్టీతో కొట్లాడినా.. రేవంత్‌తో కొట్లాడినా ఒకటే కదా! ఒకటి మాత్రం ఫిక్స్ అయిన. రేవంత్‌కు చుకలు చూపిస్తా. రేవంత్ బాధితులు చాలామంది ఉన్నారు. వారందరితో కలిపి రేవంత్ బాధిత సంఘం పెడుతున్నా. ఇంకా చాలామంది కాంగ్రెస్‌లోంచి బయటకు వస్తారు. రెండువందల కార్లతో కొడంగల్‌లో రేవంత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తా. అతణ్ని ఓడించే తిరిగి వస్తా!
ఈ ఎన్నికల్లో తామే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారుగా..
వందమాటలు చెప్తరు.. కానీ, రియాలిటీ వేరే! ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ఓటమికి బయటి మనుషులు అవసరం లేదు. రేవంత్‌రెడ్డి చాలు!
పార్టీలో రేవంత్‌రెడ్డి నియంతృత్వం పెరిగిందా? లేక ఆయనతో పొసగని వాళ్లను దూరం పెడుతున్నారని అనుకోవచ్చా?
రేవంత్ పార్టీలో తాను చెప్పిందే వేదం అనుకుంటున్నడు. పార్టీలో తన బలం పెరిగే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను వాడుకున్నాడు. ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి వాళ్లందరినీ పక్కకు నెట్టి తన మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు సీట్లిస్తున్నడు.
నిజంగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగిందా?
సహజంగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీకి ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. అయితే, బీఆర్ఎస్కు ఈ సూత్రీకరణ వర్తించదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ముందు కాంగ్రెస్ పార్టీ గానీ, రేవంత్‌రెడ్డి గానీ నిలబడలేరు.
ఫైనల్‌గా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు?
ప్రజలకు చెప్పేందుకు మా నాయకుడు కేసీఆర్ ఉన్నారు. కానీ.. నేను రేవంత్ రెడ్డికి ఒక మాట చెప్పదలుచుకున్న. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క. నీకు చుక్కలు చూపిస్తా. కొడంగల్‌లో ఎట్ల గెలుస్తవో చూస్తా. కాస్కో!
– సుంకరి