వనపర్తి, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : గొల్లపల్లి-చీర్కపల్లి రైతులు వంద రోజులకుపైగా దీక్షలు కొనసాగిస్తుంటే జిల్లాలోని మంత్రులు జూపల్లి, ఇతర ఎమ్మెల్యేలకు ఎందుకు పట్టడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. జిల్లాలో అత్యాచారాలు జరిగినా కనీసం పరామర్శించక పోవడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు.
కేవలం 6 నెలల పని ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పెండింగ్‌లో పెట్టడం ద్వారా 90 శాతం పనులు పూర్తి చేసుకున్న రిజర్వాయర్లు, కాలువలు, పంపులు నిరుపయోగంగా మారిపోయాయని అన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలమవుతుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.