నాగర్‌కర్నూల్, జూన్ 18 : అసమర్థుల పాలనలో తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడుతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రమాదాన్ని ముందుగా పసిగడితేనే మనుగడ ఉంటుందని అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్‌లో నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సారథ్యంలో ఎంతో అభివృద్ధి చేసుకుంటే.. చంద్రబాబు ప్రియశిష్యుడైన సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రమాదంలో పడిందని విమర్శించారు.
కర్ణాటక రాష్టం కృష్ణానదిపై మూడు కొత్త ప్రాజెక్టులను తాగునీటి ప్రాజెక్టుల పేరా నిర్మిస్తున్నా ఎందుకు అభ్యంతరం తెలుపలేదని సీఎంను ప్రశ్నించారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. బీహార్, బెంగాల్ వంటి రాష్ర్టాల్లో నియోజకవర్గానికి 40 వేల నుంచి 50 వేల ఓట్ల చొప్పున తొలగించి పెద్ద ఎత్తున కుట్రకు పాల్పడ్డారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తనూ గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు. ప్రతి గ్రామానికి ఒక రోజు కేటాయించి, ప్రతి కార్యకర్త బాగో గులు తెలుసుకుంటానని అన్నారు.