Road accident | రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడి మృతి
Road accident | రోడ్డు ప్రమాదంలో(Road accident) సింగరేణి కార్మికుడు(Singareni worker) మృతి చెందాడు. టిప్పర్‌ను వెనక వైపు నుంచి ఢీకొట్టడం అక్కడికక్కడే మృతి చెందాడు.
పెద్దపల్లి : రోడ్డు ప్రమాదంలో(Road accident) సింగరేణి కార్మికుడు(Singareni worker) మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నగర శివారులో సింగరేణి జీడీకే 11 ఇంక్లైన్ కోల్ కట్టర్ రాసపల్లి నాగరాజు (31)అనే కార్మికుడు మృతి చెందాడు. శనివారం నైట్ షిఫ్ట్ విధులు ముగించుకుని అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో బొగ్గులోడుతో వస్తున్న టిప్పర్‌ను వెనక వైపు నుంచి ఢీకొట్టడం అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు రెండున్నర ఏండ్ల క్రితమే సింగరేణిలో ఉద్యోగిగా విధుల్లో చేరాడు. కాగా, రోడ్డు సరిగా నిర్మించక గుంతలతో నిండి ఉండటంతో దుమ్ము లేచి రోడ్డు కనిపించకపోవడంతోనే నాగరాజు మృతి చెందాడని ఆరోపిస్తూ ఏఐటీయూసీ కార్మిక సంఘ అధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

