హైదరాబాద్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ మనుగడ, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఐదు జాతీయ కార్మిక సంఘాల నేతలు నిర్ణయించా రు. తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం కొత్త బ్లాక్‌లను దకించుకొని బొగ్గు ఉత్పత్తి చేయడం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కంపెనీ మనుగడ కోసం యాజమాన్యం తీసుకునే నిర్ణయాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. సింగరేణిలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు, కంపెనీ భవిష్యత్తు కోసం తీసుకోవాల్సిన వ్యూహాత్మక విధానాలపై ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ సంఘాల ముఖ్య నేతలంతా సింగరేణి భవన్లో గురువారం నిర్వహించిన సమావేశంలో కూలంకశంగా చర్చించారు.
సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్, సీఐటీయూ జనరల్ సెక్రటరీ నర్సింహారావు, హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. తొమ్మిదేండ్లుగా ఒక బ్లాక్ సింగరేణికి దకకపోవడంపై అన్ని సంఘాలు ఆం దోళన వ్యక్తంచేశాయి. ప్రస్తుత విధానం కొనసాగిస్తే ఆరేండ్లలో బెల్లంపల్లి, మణుగూరు, ఇల్లందు ఏరియాల మనుగడ పశ్నార్థకంగా మారబోతుందని, ఏటా కొత్త బొగ్గు గనులు ప్రారంభించుకోకపోతే, సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందని సీఎండీ ఎన్ బలరామ్ తెలిపారు. రానున్న 15 ఏండ్లలో సింగరేణిలో బొగ్గు గనులు గణనీయంగా తగ్గిపోనున్నాయని డైరెక్టర్లు పేర్కొన్నారు.