హైదరాబాద్ : ఈ నెల 4వ తేదీన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. 177 పోస్టులకు 98 వేల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. 8 జిల్లాల్లో 187 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని స్పష్టం చేసింది. శనివారం అర్ధరాత్రి వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని సింగరేణి అధికారులు సూచించారు.