హైదరాబాద్ : సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష ఫలితాలను జేఎన్టీయూ డైరెక్టర్, సింగరేణి డైరెక్టర్ శనివారం ఫలితాలను విడుదల చేశారు. సింగరేణి వెబ్సైట్ www.scclmines.comలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఉంచినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష నిర్వహించిన వారంల్లోనే ఫలితాలను విడుదల చేసినట్లు సింగరేణి డైరెక్టర్ తెలిపారు.
117 పోస్టుల కోసం 49,328 మంది అభ్యర్థులు అర్హత సాధించారని అధికారులు చెప్పారు. మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోవడంతో అందరికీ మార్కులు కలుపుతూ నిర్ణయం తీసుకున్నామని, వారం రోజుల్లోనే ప్రొవిజినల్ సెలక్షన్ జాబితా విడుదల చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 4న సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్షను ఈ నెల 4న నిర్వహించిన విషయం తెలిసిందే. 117 పోస్టులకు 99,882 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 77,907 మంది పరీక్షలకు హాజరయ్యారు.