హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థలో 272 ఎక్స్టర్నల్ పోస్టుల భర్తీకి హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించే పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆ సంస్థ చైర్మన్ బలరాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
మొత్తం 18,665 మంది అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ చేసినట్లు వెల్లడించారు. తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు(సీబీటీ) నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం హైదరాబాద్ జంట నగరాల్లోని 12 పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 08744-249992 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.