హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): సింగరేణి అభివృద్ధికి సమష్టిగా పనిచేద్దామని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం పిలుపునిచ్చారు. క్షమశిక్షణ, సమయపాలనతో ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచాలని ఆయన ఆకాంక్షించారు. సింగరేణి 37వ సంయుక్త సంప్రదింపుల కమిటీ భేటీని శనివారం రెడ్‌హిల్స్‌లోని సింగరేణిభవన్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ.. సంస్థలో రెండుగనుల్లో ఒక షిప్ట్ మొత్తం మహిళా ఉద్యోగులతో నిర్వహిస్తామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో మూడు కొత్త ప్రాజెక్ట్‌లు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. నెలరోజుల్లో ఒడిశాలోని నైనీ కోల్‌బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తామని వివరించారు.