హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరుగుతున్నదని సింగరేణి సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని థర్మల్ విద్యుత్తు కేంద్రాల డిమాండ్ మేరకు బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని ఆదేశించారు. గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జీఎంలతో సమావేశమయ్యారు. వేసవి నేపథ్యంలో బొగ్గుకు డిమాండ్ పెరుగుతున్నదని చెప్పారు.
ఇకపై రోజుకు కనీసం 2.3 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి, రవాణా చేయాలని ఆదేశించారు. రోజుకు కనీసం 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని స్పష్టంచేశారు. వచ్చే నాలుగు నెలలకు కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎన్ బలరామ్ (ఫైనాన్స్ అండ్ పర్సనల్), డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు, ఎన్వీకే శ్రీనివాస్ (ఆపరేషన్స్), జీ వెంకటేశ్వర్‌రెడ్డి (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్), అడ్వైజర్లు డీఎన్ ప్రసాద్ (మైనింగ్), సురేంద్ర పాండే (ఫారెస్ట్రీ), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ జే ఆల్విన్, జీఎం (కో ఆర్డినేషన్) ఎం సురేశ్, జీఎం (సీపీపీ) సీహెచ్ నరసింహారావు, జీఎం (మారెటింగ్ ) కే సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.