హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్ 1వ తేదీన దసరా బోనస్ చెల్లిస్తామని శ్రీధర్ వెల్లడించారు. 2021-22లో సింగరేణి మొత్తం టర్నోవర్ రూ. 26,607 కోట్లు అని తెలిపారు. సింగరేణి నికర లాభాలు రూ. 1,227 కోట్లు అని సీఎండీ పేర్కొన్నారు. లాభాల బోనస్‌గా కార్మికులకు రూ. 368 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎండీ శ్రీధర్ తెలిపారు.