హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించడంలో డాక్టర్లు తమ సామ ర్థ్యం నిరూపించుకోవాలని సింగరేణి సీఎండీ బలరాం సూచించారు. గురువారం సింగరేణి వ్యాప్తంగా ఏరియా దవావాఖనలో ప్రధాన వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఏరియా దవాఖానల యాజమాన్యాలు తక్షణమే కావాల్సిన కనీస వైద్య పరికరాలు, మందుల ప్రతిపాదనలు పంపించాలని, తదుపరి తనిఖీల్లో ఏ ఒక పరికరం లేదనే మాట రాకూడదని హెచ్చరించారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న రోగులకు ఏరియా దవాఖానల్లో వైద్యం అందించే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయకుండా హైదరాబాద్కు రిఫర్ చేస్తున్నారని, తద్వారా మూడేండ్లలో రూ.30 కోట్లు ఉన్న రిఫరల్ బిల్లులు రూ.100 కోట్లకు చేరాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సింగరేణి ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం యాజమాన్యం ఏటా రూ.400 కోట్ల నిధులు వెచ్చిస్తున్నదని ఆయన తెలిపారు.