మంగళవారం 26 మే 2020
Telangana - May 18, 2020 , 22:34:20

వ్యవసాయ పొలంలో వెండి నాణేలు లభ్యం

వ్యవసాయ పొలంలో వెండి నాణేలు లభ్యం

కల్వకుర్తి : నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలోని రైతు కాశన్నకు చెందిన మామిడి తోటలో వెండి నాణేలు లభ్యమయ్యాయి. తాసిల్దార్‌ రాంరెడ్డి, ఎస్సై మహేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి పట్టణానికి చెందిన కాశన్న ముకురాల గ్రామంలో పొలం కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం పొలంలో రాళ్లను తొలగిస్తుండగా 72 వెండి నాణేలు లభ్యమైన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. తవ్వకాల్లో లభ్యమైన నాణేలను దాచుకోవడం నేరమని భావించిన కాశన్న సోమవారం పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా వారు కాశన్న పొలం వద్దకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన నాణేలను స్వాధీనం చేసుకుని అవి లభ్యమైన చోట జేసీబీ సాయంతో తవ్వకాలు జరుపుతున్నారు. logo