హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): మూడు కమిషనరేట్ల పరిధిలోని జోన్ల పునర్వ్యవస్థీకరణ, పోస్టుల మంజూరు ఫైల్‌పై హోంశాఖ మంత్రి మహమూద్ అలీ సంత కం చేశారు. ఆదివారం ఆయన సచివాలయం మొదటి అంతస్థులోని తన చాంబర్లో ఆసీనులయ్యారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ కూడా తన క్యాబిన్లో ఆసీనుల య్యారు. డీజీపీ అంజనీకుమార్, ఏసీబీ డీజీ పీ రవిగుప్తా, ఏడీజీలు మహేశ్‌భగవత్, స్వాతిలక్రా, నాగిరెడ్డి, సంజయ్‌కుమార్‌జైన్, సందీప్‌శాండిల్య, శిఖాగోయల్, కమిషనర్లు సీవీ ఆనంద్, డీఎస్ చౌహా న్, స్టీఫెన్ రవీంద్ర, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఐ జీ రమేశ్‌రెడ్డి, రమేశ్‌నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.