High Court : పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా తప్పించుకుంటున్న రేవంత్ సర్కారుపై హై కోర్టు (High Court) అసహనం వ్యక్తం చేసింది. బాధితులకు పరిహారం ఆలస్యంపై, ప్రమాదంపై దర్యాప్తు కోసం సిట్ వేయాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్పై శుక్రవారం హైకోర్టు స్పందించింది. సిగాచి బాధితులకు పరిహారం ఎంత ఇస్తామని చెప్పారు? ఎప్పుడు ఎంత ఇస్తారు? అంటూ ముఖ్యమంత్రిపై హైకోర్టు ప్రశ్నలు కురిపించింది.
గత ఏడాది సిగాచి కంపెనీలో జరిగిన పేలుడులో 58 మంది దుర్మరణం చెందగా.. 8 మంది ఆచూకీ తెలియలేదు. ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇప్పిస్తామని ప్రకటించారు. అయితే.. ఈఎస్ఐ చట్టం ప్రకారం రూ.42 లక్షలు ఇచ్చేందుకు సిగాచి కంపెనీ యాజయాన్యం అంగీకరించింది.
సిగాచి బాధితులకు పరిహారమేది ?
పరిహారం ఇవ్వకుండా తప్పించుకుంటున్న రేవంత్ సర్కారుపై హైకోర్టు అసహనం
బాధితులకు పరిహారం..ప్రమాద దర్యాప్తు కోసం సిట్ వేయాలని హైకోర్టులో పిటిషన్
పరిహారం ఎంత ఇస్తామని చెప్పారు, ఎప్పుడు ఎంత ఇస్తారంటూ హైకోర్టు ప్రశ్నలు
గత ఏడాది సిగాచి కంపెనీలో… pic.twitter.com/l1gNMgcadz
— Telugu Scribe (@TeluguScribe) January 30, 2026
ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన రూ. 58 లక్షల పరిహారంపై రేవంత్ సర్కారు నిర్లక్ష్యం వహిస్తోంది. బాధితులకు అండగా ఉంటామని చెప్పి ఇప్పుడు వారిని ఇబ్బందులకు గురి చేయడాన్ని ధర్మాసనం తప్పు పట్టింది. అటు సిగాచి, ఇటు రేవంత్ సర్కారు అవలంబిస్తున్న తీరుపై హైకోర్టు సీరియస్ అయింది. సిగాచి పరిహారంపై నివేదిక ఇవ్వాలని ఈపీఎఫ్, ఈఎస్ఐ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.