సిద్దిపేట, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పొత్తిళ్లలో బిడ్డను పొదివి పట్టుకొన్నట్టు.. బిడ్డలను తండ్రి తన భుజాలపై మోసినట్టు రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడు తూ అద్భుత పథకాలతో సబ్బండ వర్ణాలను స ర్వతోముఖ అభివృద్ధివైపు నడిపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి ఊరూ వాడాజై కొడుతున్నాయి. మేమంతా బీఆర్ఎస్తోనే అంటూ నినదిస్తున్నాయి. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా ఓట్లన్నీ బీఆర్ఎస్కే’ అంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామం కూడా శనివారం ఏకగ్రీ వ తీర్మానం చేసింది. ‘త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మా మద్దతు బీఆర్ఎస్ పార్టీకే.. మా ఓట్లు మంత్రి హరీశ్‌రావుకే, గంపగుత్తగా కారు గుర్తుకే ఓట్లేస్తాం’ అని మంత్రి హరీశ్‌రావు సమక్షంలోనే రాంపూర్ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేసి, రాతపూర్వకంగా హరీశ్‌రావుకు అందజేశారు. శనివారం గ్రామానికి చేరుకున్న మంత్రికి మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులతో స్వాగతం పలికి, తిలకం దిద్ది బోనాలతో గ్రామంలోకి తీసుకెళ్లారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుర్రపు బండిపై మంత్రి హరీశ్‌రావు ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. గత ఎన్నికల్లోనూ రాంపూర్‌లోనే తొలి ఏకగ్రీవ తీర్మానం చేశారు. మళ్లీ రాం పూర్ గ్రామస్తులు తీర్మానం చేయడంతోపాటు గ్రామస్తుల తరపున ఎన్నికల ఖర్చు కు గ్రామ ఉపసర్పంచ్ విఠల్‌రెడ్డి రూ. 5,116ను మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. బోణీ రాంపూర్ నుంచి ప్రారంభం కావడంతో మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 494 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడ్డాయి. మిగిలిన ఏడు ఓట్లలో రెండు నోటాకు పడగా, మిగతావి చెల్లకుం డా పోయాయి. ప్రస్తుతం రాంపూర్ గ్రా మంలో 568 మంది ఓటర్లు ఉన్నారు.