Telangana | సిద్దిపేట అర్బన్: సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బ న్ మండలం మందపల్లి మధిర గ్రామమైన పిట్టలవాడకు చెందిన విద్యార్థులు తమ గ్రామంలో పాఠశాల లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామంలో 70కి పైగా ఇండ్లు ఉండగా.. జనాభా సుమారు 300 మంది పైగానే ఉన్నారు. కానీ అక్కడ అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలలు లేవు. గతేడాది వరకు ఆ గ్రామంలోనే నడిచిన తరగతులు ఈ విద్యా సంవత్సరం నుంచే అక్కడ తరగతులను నిలిపివేసినట్లు గ్రామస్తులు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సిద్దిపేట అర్బన్ మం డలం మందపల్లి మధిర గ్రామమైన పిట్టలవాడలో 20 డబుల్ బెడ్ రూమ్‌లను ప్రభుత్వమే నిర్మించి వారికి అం దించింది. నాడు పిట్టలవాడ గ్రామ ప్రజల కోరిక మేరకు నాటి మంత్రి హరీశ్‌రావు పిట్టల వాడలోని ఓ ఇంట్లో తాత్కాలికంగా పాఠశాల ఏర్పాటు చేసి విద్యార్థులకు బోధన చేయించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల చొరవతో గత సంవత్సరం వరకు తాత్కాలిక పాఠశాలలో తరగతులు నడిచాయి. కానీ ఈ విద్యాసంవత్సరం నుంచి అక్కడ పాఠశాలను తీసివేశారు. దీంతో ఆ గ్రామ విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోజూ పిట్టల వాడ నుంచి సమీపంలో ఉన్న మందపల్లికి వెళ్లాలంటే సుమారు 4 కి.మీలు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజూ ఉదయం ఏడు గంటలకు బయల్దేరి.. తిరిగి పాఠశాల ముగిశాక రాత్రి ఏడు గంటల వరకు పిల్లలు ఇంటికి చేరుకుంటున్న ట్లు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పిట్టలవాడలో ఒకటో తరగతి నుంచి పదో వరకు చదువుకునే విద్యార్థులు సుమారు 40 నుంచి 50 మంది వరకు ఉన్నా రు. జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకునే వారు 20 మంది ఉండగా.. మిగతా వారంతా ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు.
ఆ గ్రామంలోని పిల్లలు బడికి వెళ్లి చదువుకోవాలంటే 4 కిలోమీటర్లు నడవాల్సిందే. గ్రామంలో పాఠశాల లేక వేరే పాఠశాలకు వెళ్లాలంటే రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. సమీప గ్రామంలోని పాఠశాలకు వెళ్లాలంటే ఎండకు, వానకు సం బంధం లేకుండా రోజూ (రానుపోనూ కలిపి మొత్తం 8 కి.మీటర్లు) నడిస్తే తప్ప వెళ్లలేని పరిస్థితి.
రోజూ మందపల్లిలోని పా ఠశాలకు వెళ్లాలంటే అటు నాలుగు, ఇటు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్తు న్నాం. చాలామంది చిన్న పిల్లలు ఉన్నారు. వారంద రూ అంతదూరం నడిచి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి గ్రామంలో తిరిగి పాఠశాలను ప్రారంభించాలి.
– అఖిల, తొమ్మిదో తరగతి, పిట్టలవాడ
రోజూ ఉదయం ఏడు గం టలకు స్కూల్‌కు బయల్దేరి వెళ్తున్నాం. ఇంటికి వచ్చే సరికి రాత్రి ఏడుగంటలు అవుతున్నది. దయచేసి మా గ్రా మంలో పాఠశాల ఏర్పాటు చేయండి. రోజూ అంతదూరం నడిచి పాఠశాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది.
– సుగుణ, ఏడో తరగతి, పిట్టలవాడ
గతేడాది వరకు గ్రామంలో నే బడి నడిచింది. ఈ ఏడా ది దాన్ని తీసివేయడంతో ఉపాధ్యాయులు రావట్లే దు. గ్రామంలోని పిల్లలు నాలుగు కిలోమీటర్లు నడి చి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం మీదుగా బస్సులు కూడా లేవు. చాలా మంది చిన్న పిల్లలు ఉన్నా ఒక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం లేదు. అధికారులు స్పందించి పాఠశాల ఏర్పాటు చేయాలి
– చంద్రం, గ్రామస్తుడు, పిట్టలవాడ