గోదావరిఖని, డిసెంబర్ 6: సింగరేణిలో కారుణ్య నియామకాల రద్దుకు కాం గ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి మెడికల్ బోర్డు తీరుపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక రోజు నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా కారుణ్య నియామకాలు చేపట్టక, 9 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకుండా, దీర్ఘకాలిక వ్యాధులతో కార్మికులు బాధపడుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అనారోగ్యంతో ఉన్న కార్మికులను అన్ఫిట్ చేయాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి డిమాండ్ చేశారు.