నెల్లికుదురు జూన్ 15 : ప్రభుత్వ పథకాలకు అప్లై అంటూ సైబర్ నేరగాండ్లు పంపించే లింకులను నమ్మి క్లిక్ చేయవద్దని నెల్లికుదురు ఎస్ఐ చిర్ర రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర పథకాల పేరిట సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎం కిసాన్, ముద్ర లోన్స్ వంటి పేర్లతో సైబర్ నేరగాళ్లు వలవేస్తున్నారని గుర్తు చేశారు.
కేవలం అధికారిక సైట్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ లలో వచ్చే లింకులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. పెట్టుబడుల కోసం సోషల్ మీడియాను నమ్మవద్దని, రోజుల్లో డబ్బులు రెట్టింపు అవుతాయంటే కచ్చితంగా అది అబద్ధమేనని, అపరిచితుల మాటలు నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోవద్దని హెచ్చరించారు.