హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో గురువారం జరిగిన ఓ వివాహ వేడుకలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. నగరంలో మధ్యాహ్నం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ వివాహానికి హాజరయ్యారు. అక్కడ కేటీఆర్‌కు రెబల్‌స్టార్ దివంగత కృష్ణంరాజు సతీమణి, సినీ నటుడు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఎదురుపడ్డారు.
కేటీఆర్‌ను పలకరించిన ఆమె.. ‘నెక్ట్స్ అధికారం మనదే’ అంటూ కేటీఆర్ తలపై చేయి వేసి ఆశీర్వదించారు. ‘అందరినీ అడిగినట్టు చెప్పండి’ అంటూ కేటీఆర్ బదులిచ్చారు. కేటీఆర్, శ్యామలాదేవి పరస్పరం పలకరించుకోడాన్ని పెండ్లికి హాజరైన ఆహ్వానితులు ఆసక్తిగా తిలకించారు.