ఆదిలాబాద్ : శ్రీరామ నవమి(Sri Rama Navam) సందర్భంగా ఆదిలాబాద్(Adilabad) పట్టణంలో గురువారం శ్రీరాముని శోభాయాత్ర(Shobhayatra) ఉత్సాహంగా, వైభవంగా కొనసాగింది. జోగు రామన్న యువసేన ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో నిర్వహించిన శోభాయాత్రను ఎమ్మెల్యే జోగు రామన్న((Mla Jogu Ramanna) ,గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన యువకులు కాషాయ జెండాలను చేతపట్టుకుని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. శోభాయాత్రలో యువకులు జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ యువ నాయకుడు జోగు మహేందర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర కొనసాగగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు(Police) పటిష్ట బందోబస్తు నిర్వహించారు.