స్టూడెంట్స్ ఫెయిల్.. హెచ్ఎంలకు నోటీస్
వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయడంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టీస్ టెస్టుల్లో పలువురు ఫెయిలవడం ఆయా బడుల హెచ్ఎంలకు తలనొప్పిగా మారిం ది.
- 60శాతం లోపు ఫలితాలు వచ్చిన 31 స్కూళ్ల హెడ్మాస్టర్లకు షోకాజ్
- విద్యార్థులు ప్రాక్టీస్ టెస్ట్‌కు గైర్హాజర్పైనా సీరియస్
- కరీంనగర్ జిల్లాలో అధికారుల తీరుపై ఉపాధ్యాయ సంఘాల గుర్రు
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ)/ కరీంనగర్ కమాన్ చౌరస్తా: వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయడంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టీస్ టెస్టుల్లో పలువురు ఫెయిలవడం ఆయా బడుల హెచ్ఎంలకు తలనొప్పిగా మారిం ది. ఫలితాల్లో వెనుకబడటం, విద్యార్థులు పరీక్షలకు డుమ్మా కొట్టడం లాంటి కారణాలు చూపుతూ 31 మంది ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖాధికారుల షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎస్సెస్సీ ప్రాక్టీస్ టెస్ట్-1 లో ఆయా పాఠశాలల్లో 60శాతం లోపు విద్యార్థులే ఉత్తీర్ణత సాధించారు. మరికొన్ని పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. దీనిని జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకున్నది.
పాఠశాల స్థాయిలో ప్రణాళిక, పర్యవేక్షణ లోపాలతోనే ఇలా జరిగినట్టు అధికారులు గుర్తించారు. 60శాతం లోపు ఫలితాలొచ్చిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులిచ్చారు. మీపై క్రమశిక్షణ చర్యలెందుకు తీసుకోకూడదో స్పష్టంచేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫలితాలు తక్కువగా రావడానికి కారణాలు ఏంటో తెలిపాలని కోరారు. ఫలితాలు మెరుగయ్యేందుకు తీసుకునే చర్యలతో పాటు విద్యార్థుల గైర్హాజరుకు కారణాలపై ఆరా తీశారు. కొందరు హెచ్ఎంలు ఎంఈవోలుగా అదనపు బాధ్యతల్లో ఉన్నారని, అనేక పనులు అప్పగించి షోకాజ్ నోటీసులివ్వడం ఎంత వరకు సబబని ఉపాధ్యాయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నోటీసులను ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

