సర్ విధుల్లో నిర్లక్ష్యం.. ముగ్గురు ఈఆర్వోలకు షోకాజ్ నోటీసులు
ఓటర్ల ప్రత్యేక స మగ్ర సవరణ (సర్) ప్రక్రియలో నిర్ల క్ష్యం వహిస్తే సహించేది లేదని ఎన్నికల సంఘం (ఈసీ) తీవ్ర హెచ్చరికలు జారీచేసింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): ఓటర్ల ప్రత్యేక స మగ్ర సవరణ (సర్) ప్రక్రియలో నిర్ల క్ష్యం వహిస్తే సహించేది లేదని ఎన్నికల సంఘం (ఈసీ) తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవం తం చేయాలని, విధుల్లో వెనుకబడిన ని యోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అ ధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాల ని ఈసీ ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సం ఘం ఆదేశాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ స్పందించారు. ఎస్ఐఆర్ పురోగతిపై ఈఆర్వోలు, ఎన్నికల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
డాటా డిజిటలైజేషన్, ఎన్యుమరేషన్ ఫా రాలు సకాలంలో పూర్తి చేయ డం, ఈసీ షెడ్యూల్ అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్షలో సనత్‌నగ ర్, ముషీరాబాద్, సికింద్రాబాద్ కం టోన్మెంట్ అ సెంబ్లీ నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ నిరుత్సాహకరంగా ఉన్నట్టు గుర్తించారు. ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంపై కమిషనర్ అసంతృప్తి వ్యక్తంచేశారు.
విధుల్లో అలసత్వాన్ని తీ వ్రంగా పరిగణిస్తూ సదరు మూడు ని యోజకవర్గాల ఈఆర్వోలకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీచేశారు. పనితీరు మెరుగుపరుచుకోని పక్షంలో కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఈఆర్వోలు ప్రతిరోజు డి జిటలైజేషన్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాలని, రో జువారీ నివేదికలను అప్డేట్ చేయాలని చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేదా నిర్లక్ష్యం జరిగినా కఠినచర్యలు ఉంటాయని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

